![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం క్రేజీగా సాగుతుంది. కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. గతవారం వరకు వీక్ అనుకున్న కంటెస్టెంట్స్ అంతా అయిదో వారం చెలరేగిపోతున్నారు. ఇమ్మ్యూనిటీ పొందాలని టాస్క్ లలో తమ సత్తా చాటుతున్నారు.
హౌస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుని చూసిన ఆడియన్స్ అదే రేంజ్ లో ఓటింగ్ వేస్తున్నారు. హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లో బాగా ఆడినవారికి ఓటింగ్ పెరిగింది. అయిదో వారం పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలు నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్పించి మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.
ఇక అనఫీషియల్ వోటింగ్ ప్రకారం తనూజ 19.44 శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ గా నిలిచింది. గత వారం రీతూ చౌదరి వెన్నుపోటుతో కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన పడాల పవన్ కళ్యాణ్ కు కూడా మెరుగైన ఓటింగ్ లభిస్తోంది. నాగార్జున క్లాస్ తీసుకోవడంతో పవన్ ఆటతీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. టాస్క్ లలో మన సైనికుడు అరివీర భయంకరంగా రెచ్చిపోతున్నాడు. తాజా ఓటింగ్ లో 15.82 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. రీతూ చౌదరి, డీమాన్ కి తక్కువ ఓటింగ్ పడుతోంది. అలాగే శ్రీజకి కుడా ఓటింగ్ తక్కువనే ఉంది. స్వల్ప ఓట్ల తేడాతో రీతు చౌదరి, డీమాన్, శ్రీజ లీస్ట్ లో ఉన్నారు. ఈ వారం వీరి ముగ్గురిలో నుండే ఎలిమినేషన్ అనేది ఫిక్స్. మరి వీరిలో ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
![]() |
![]() |